రాజ్‌భవన్, హైకోర్టును ముట్టడించిన న్యాయవాదులు

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా.. రాజ్‌భవన్‌ను ముట్టడించారు న్యాయవాదులు. నాంపల్లి క్రిమినల్ కోర్టులోని న్యాయవాదులు.. గురువారం ఉదయం రాజ్‌భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వామన్‌రావు దంపతులను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో విఫలమైన సీపీ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని న్యాయవాదులు నినాదాలు చేశారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. వామన్‌రావు హత్య కేసును సిట్టింగ్ జడ్జితో […]

Update: 2021-02-18 00:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా.. రాజ్‌భవన్‌ను ముట్టడించారు న్యాయవాదులు. నాంపల్లి క్రిమినల్ కోర్టులోని న్యాయవాదులు.. గురువారం ఉదయం రాజ్‌భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వామన్‌రావు దంపతులను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో విఫలమైన సీపీ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని న్యాయవాదులు నినాదాలు చేశారు.

మరోవైపు రాష్ట్ర హైకోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. వామన్‌రావు హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. అడ్వొకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకురావాలని న్యాయవాదులు కోరారు.

Tags:    

Similar News