కేసీఆర్ బీ కేర్ ఫుల్.. పంచాగ పఠనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

శోభకృత్‌ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Update: 2023-03-23 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: శోభకృత్‌ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలంటూ వేద పండితుడు పంచాంగ పఠనంలో హెచ్చరికలు జారీ చేశారు. తన సొంత వర్గంలోనే ఉన్న కొంత మంది వ్యక్తుల నుంచి తాను వ్యతిరేకత ఎదర్కొనే అశకాశం ఉందని ప్రముఖ వేద పండితుడు సంతోష్ కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనంలో తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఈ ఏడాది శుభాశుభాల మిశ్రమంగా ఉంటాయని అందుకే ఆయన చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏప్రిల్‌ తరువాత ఆయన గ్రహ స్థితి కొంత పర్వాలేదనట్లుగానే ఉంటుందని తెలిపారు. అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందన్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో అంతులేని ఆశ్యర్యకరమైన సంఘటను చోటుచేసుకోనున్నాయని తెలిపారు. మత సంస్థల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలతో సర్కార్ కు ముప్పు ఉందని ఆయన జోస్యం చెప్పారు. కుల చిచ్చు, మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం కూడా ఉందని పంచాంగ పఠన సారాంశం. 

Read more:  కేసీఆర్ బీ కేర్ ఫుల్.. పంచాగ పఠనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి! 

BRS అటెన్షన్ డైవర్ట్ ప్లాన్ రివర్స్ అయిందా?

Ugadi Panchangam: ఏపీకి కాబోయే సీఎం ఎవరు? 

Tags:    

Similar News