దూబేను ఎవరు పట్టించారో తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గత గురువారం పోలీసులను పొట్టనపెట్టుకున్న కరుడు గట్టిన రౌడీషీటర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అతడి కోసం రాష్ట్రమంతా గాలించారు. ఈ క్రమంలో జూలై 5న హర్యానాలోని ఓ హోటల్ లో దూబే ఉన్నాడని పోలీసులకు సమాచారమందింది. అక్కడికి పోలీసులు వెళ్లే లోపే అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. జూలై 8న ఉత్తరప్రదేశ్ […]

Update: 2020-07-10 00:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గత గురువారం పోలీసులను పొట్టనపెట్టుకున్న కరుడు గట్టిన రౌడీషీటర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అతడి కోసం రాష్ట్రమంతా గాలించారు. ఈ క్రమంలో జూలై 5న హర్యానాలోని ఓ హోటల్ లో దూబే ఉన్నాడని పోలీసులకు సమాచారమందింది. అక్కడికి పోలీసులు వెళ్లే లోపే అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. జూలై 8న ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఆటోలో వెళ్తూ తనకు కన్పించాడని ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. కాగా, గురువారం మధ్యప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యాడు. ఉజ్జయినీలోని మహాకాళేశ్వరుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ దూబేను గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం యూపీ పోలీసులకు అప్పజెప్పారు. అక్కడి నుంచి కాన్పూర్ కు వస్తుండగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దూబే మృతిచెందాడు.

Tags:    

Similar News