ఏపీలో కొనసాగుతున్న కరోనా తీవ్రత
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 73,341 శాంపిల్స్ పరీక్షించగా 1,746 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656కు చేరింది. అదే సమయంలో కరోనాతో 20 మంది మృతి చెందగా, తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 13,615కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,648 మంది […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 73,341 శాంపిల్స్ పరీక్షించగా 1,746 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656కు చేరింది. అదే సమయంలో కరోనాతో 20 మంది మృతి చెందగా, తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 13,615కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,58,275కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,55,26,861 శాంపిల్స్‌ని పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.