నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

దేశీయ మార్కెట్లు లంచ్ సమయంలో కొంతమేర లాభాలను చూసినప్పటికీ చివరగా నష్టాలతోనే ముగిశాయి. బుధవారం భారీ లాభాలు సాధించప్పటికీ గురువారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనను మదుపర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌ను అస్థిరంగా ఉంచుతోంది. ఇది దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపిస్తోంది. టెలికాం రంగం పరిణామాలు కూడా కొంత ప్రభావం చూపగలుగుతున్నాయని, ఏజీఆర్ […]

Update: 2020-02-20 06:26 GMT

దేశీయ మార్కెట్లు లంచ్ సమయంలో కొంతమేర లాభాలను చూసినప్పటికీ చివరగా నష్టాలతోనే ముగిశాయి. బుధవారం భారీ లాభాలు సాధించప్పటికీ గురువారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనను మదుపర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌ను అస్థిరంగా ఉంచుతోంది. ఇది దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపిస్తోంది. టెలికాం రంగం పరిణామాలు కూడా కొంత ప్రభావం చూపగలుగుతున్నాయని, ఏజీఆర్ చెల్లిపంపులు జరిగితే బ్యాంకింగ్ రంగం కొంచెం మెరుగవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెన్సెక్స్ 152.88 పాయింట్లను నష్టపోయి 41,170 వద్ద ముగిసింది. నిఫ్టీ 45.05 పాయింట్ల నష్టంతో 12,080 వద్ద క్లోజయింది. ఇండెక్స్‌లో దాదాపు 18 స్టాక్స్ నష్టాల్లోనే క్లోజయ్యాయి. ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 1.48 శాతం నష్టపోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్ అధిక లాభాలను చూడగా, నెస్లే ఇండియా, హిందూస్తాన్ యూనిలివర్, టీసీఎస్ నష్టాల్లో కదలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.63 వద్ద ఉంది. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లు మూసివేయనున్నారు.

Tags:    

Similar News