ఆత్మ గౌరవ భవనాలకు భూములు సరే.. నిధులు ఇవ్వండి
దిశ, తెలంగాణ బ్యూరో: ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కొరకు నిధులు కేటాయించాలని బీసీ సంఘాలు మంత్రి గంగుల కమలాకర్‌ని కోరాయి. లోద్ కులస్థులకు ఉప్పల్ భగాయత్లో కేటాయించిన 20 గుంటలకు అధనంగా భూమితో పాటు నిధుల్ని ఇవ్వాలని కోరారు. దీనితో పాటు తెలంగాణలో బీసీ ఏలో ఉన్న అగ్నికుల క్షత్రీయులు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్నామని తమకూ ఆత్మగౌరవ భవనాన్ని కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాను అని మంత్రి హామీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కొరకు నిధులు కేటాయించాలని బీసీ సంఘాలు మంత్రి గంగుల కమలాకర్‌ని కోరాయి. లోద్ కులస్థులకు ఉప్పల్ భగాయత్లో కేటాయించిన 20 గుంటలకు అధనంగా భూమితో పాటు నిధుల్ని ఇవ్వాలని కోరారు. దీనితో పాటు తెలంగాణలో బీసీ ఏలో ఉన్న అగ్నికుల క్షత్రీయులు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్నామని తమకూ ఆత్మగౌరవ భవనాన్ని కేటాయించాలని కోరారు.
ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాను అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోద్ క్షత్రీయ సదర పంచాయత్ ప్రతినిధులు హరిద్వార్ సింగ్, భగీరథ్ సింగ్, తెలంగాణ అగ్నికుల క్షత్రీయ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు టి వెంకటేశ్వర్ రావు, చిప్పాల రామక్రుష్ణ తదితరులు పాల్గొన్నారు.