ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ : ఆర్జేడీ
దిశ, వెబ్ డెస్క్ : బీహార్ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అక్కడ రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇది ఆరేళ్ల పాటు కొనసాగుతుందని ప్రకటించింది. బహిష్కరణకు గురైన వారిలో ప్రేమచౌదరి, మహేశ్ ప్రసాద్ యాదవ్, ఫరాజ్ ఫాత్మీలు ఉన్నారు. ‘ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ […]
దిశ, వెబ్ డెస్క్ :
బీహార్ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అక్కడ రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇది ఆరేళ్ల పాటు కొనసాగుతుందని ప్రకటించింది. బహిష్కరణకు గురైన వారిలో ప్రేమచౌదరి, మహేశ్ ప్రసాద్ యాదవ్, ఫరాజ్ ఫాత్మీలు ఉన్నారు.
‘ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచనల మేరకు వారిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి అలోక్ మెహతా ప్రకటించారు. ఈ ముగ్గురు కూడా అధికార జేడీయూలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు నితీశ్ కుమార్‌ను వీరు బహిరంగంగానే మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్జేడీ వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వారిని బహిష్కరించింది.