పోతురాజుల నృత్యాల మధ్య వైభవంగా లాల్ బజార్ బోనాలు

దిశ, కంటోన్మెంట్: పోతురాజుల నృత్యాలు.. బ్యాండ్ మేళాలు.. డప్పు వాయిద్యాల నడుమ లాల్ బజార్ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లాల్ బజార్ బోనాల శోభను సంతరించుకుంది. మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటే విధంగా బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్కాస్, స్టాళ్లు భక్తులను అలరించాయి. బోనాల వేడుకల్లో స్థానిక […]

Update: 2021-07-28 23:40 GMT

దిశ, కంటోన్మెంట్: పోతురాజుల నృత్యాలు.. బ్యాండ్ మేళాలు.. డప్పు వాయిద్యాల నడుమ లాల్ బజార్ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లాల్ బజార్ బోనాల శోభను సంతరించుకుంది. మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటే విధంగా బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్కాస్, స్టాళ్లు భక్తులను అలరించాయి. బోనాల వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే సాయన్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, మహేశ్వర్ రెడ్డి, నళిని కిరణ్, శ్యాంకుమార్, ప్యారసాని భాగ్యశ్రీ, మహిళ నేత నాగినేని సరిత, నివేధిత తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News