Pawan Kalyan పై లక్ష్మీ పార్వతి ఫైర్.. మీ ఇంటి స్త్రీలను అవమానించిన హీనుడితో కలిసి..

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ బయటకు రాని పోసాని కృష్ణమురళి భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. పోసాని సతీమణి ఎంతో ఉత్తమురాలు అని అలాంటి మహిళను అవమానించడం దురదృష్టకరమన్నారు. ముగింపు తొందరలోనే ఉంటుందంటూ విమర్శించారు. భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు అంటూ లక్ష్మీపార్వతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర […]

Update: 2021-09-29 03:04 GMT
Pawan Kalyan పై లక్ష్మీ పార్వతి ఫైర్.. మీ ఇంటి స్త్రీలను అవమానించిన హీనుడితో కలిసి..
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ బయటకు రాని పోసాని కృష్ణమురళి భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. పోసాని సతీమణి ఎంతో ఉత్తమురాలు అని అలాంటి మహిళను అవమానించడం దురదృష్టకరమన్నారు. ముగింపు తొందరలోనే ఉంటుందంటూ విమర్శించారు. భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు అంటూ లక్ష్మీపార్వతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిన హీనుడు టీడీపీ అధినేత చంద్రబాబు అని ఆయన హీన రాజకీయాలకు వారసత్వంగా మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పవన్ కల్యాణ్ సాగిస్తున్న దాడులు ఎంతోకాలం సాగవని చెప్పుకొచ్చారు. మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారంటూ విమర్శించారు. ఈ పొత్తులు.. ఎత్తులకు ప్రజలు సరైన సమాధానం చెప్తారన్నారు. మరోవైపు పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక కూడా చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. నీచ, నికృష్ట, రాజకీయ చదరంగం ప్రారంభించి, చివరకు సంస్కార హీనుల్ని తయారుచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అంటూ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.

Tags:    

Similar News