మహిళా సర్పంచ్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మాజీ మంత్రి.. ఏం చేశారంటే?

దిశ, జడ్చర్ల: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు సీఎం కేసీఆర్ మానస పుత్రికలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 52 లక్షల నిధులతో పీఏసీఎస్ ఆవరణలో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని, రైతు వేదికను మండల ప్రజా ప్రతినిధులతో […]

Update: 2021-11-06 23:39 GMT

దిశ, జడ్చర్ల: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు సీఎం కేసీఆర్ మానస పుత్రికలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 52 లక్షల నిధులతో పీఏసీఎస్ ఆవరణలో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని, రైతు వేదికను మండల ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మిడ్జిల్ సర్పంచ్ రాధికా వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని, దీంతో రాష్ట్రంలో పంటల సాగు మరింత పెరుగుతుందన్నారు.

నాడు వ్యవసాయం చావలేక చేసేది.. అయితే నేడు ఉన్నత ఉద్యోగాలు వదిలి అనేక మంది యువకులు రైతులుగా మారుతున్నారని, సమృద్ధిగా నీళ్లు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడంతో రైతులు వ్యవసాయం పట్ల మక్కువ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రైతులు రైతు వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, జెడ్పీటీసీ శశిరేఖ, మహబూబ్నగర్ డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గౌస్ సుదర్శన్, ఉప సర్పంచ్ పద్మ మల్లేష్, కో ఆప్షన్ సభ్యుడు సనన్, రైతుబంధు మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు, ఎంపీడీవో సాయి లక్ష్మి సిద్ధార్థ, ఏఈఓ మయూరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు యాదవ్, జిల్లా నాయకులు బాల్ రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

Tags:    

Similar News