Lagaan's 20th anniversary : అప్పులతో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి : అమీర్ ఖాన్
దిశ, సినిమా : ‘లగాన్’ సినిమా 20వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పలు విషయాలను వెల్లడించాడు. అప్పటివరకు నిర్మాతగా మారనని చాలాసార్లు ప్రకటించిన అమీర్.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని భారీ చిత్రాల్లో ఒకటైన ‘లగాన్’ నిర్మించడంపై తనకు మాటమీద నిలబడే అలవాటు లేదని తెలిపాడు. ఫిల్మ్ మేకర్‌గా తన తండ్రి తాహిర్ హుస్సేన్ ఆర్థిక కష్టాలను దగ్గరి నుంచి చూసాక, ప్రొడ్యూసర్‌గా మారకూడదని నిర్ణయించుకున్నానని.. కానీ ఆ తర్వాత తప్పలేదన్నాడు. ‘మా […]
దిశ, సినిమా : ‘లగాన్’ సినిమా 20వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పలు విషయాలను వెల్లడించాడు. అప్పటివరకు నిర్మాతగా మారనని చాలాసార్లు ప్రకటించిన అమీర్.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని భారీ చిత్రాల్లో ఒకటైన ‘లగాన్’ నిర్మించడంపై తనకు మాటమీద నిలబడే అలవాటు లేదని తెలిపాడు. ఫిల్మ్ మేకర్‌గా తన తండ్రి తాహిర్ హుస్సేన్ ఆర్థిక కష్టాలను దగ్గరి నుంచి చూసాక, ప్రొడ్యూసర్‌గా మారకూడదని నిర్ణయించుకున్నానని.. కానీ ఆ తర్వాత తప్పలేదన్నాడు. ‘మా నాన్న మంచి నిర్మాతే అయినా, బిజినెస్ ఎలా చేయాలో తెలియక డబ్బంతా పోగొట్టుకున్నాడు. అప్పుల్లో కూరుకుపోయి దివాళ తీసే పరిస్థితి వచ్చింది. దాదాపు రోడ్డున పడే స్టేజ్‌కు చేరుకున్నాం. అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బుల కోసం నిత్యం ఫోన్ చేస్తుండేవారు. దాదాపు మూడు నాలుగేళ్లు ఇదే పరిస్థితి కొనసాగింది’ అని చెప్పుకొచ్చాడు.
సిచ్యువేషన్ చేయిదాటి పోవడంతో నాన్న 40 ఏళ్ల వయసులో కూడా జాబ్ చేసేందుకు కూడా సిద్ధపడ్డాడని అప్పటి రోజులు గుర్తుచేసుకున్నాడు. అయితే ‘లగాన్’ సినిమా నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనుకోకుండా ప్రొడ్యూసర్‌గా మారానన్న అమీర్.. ఆ మూవీ తర్వాత కూడా నిర్మాతగా కొనసాగకూడదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిపాడు.