లేడీ ప్రొఫెసర్ పాడు పని.. JNTU క్యాంపస్‌లో మూడు రాత్రులు

దిశ, ఏపీ బ్యూరో : చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైయున్న విద్యాసంస్థలోని గెస్ట్‌హౌస్‌ను ఓ ప్రొఫెసర్ నిర్వాకం వల్ల అపవిత్రం అయ్యింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్‌లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్‌లో చోటు చేసుకుంది. ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్‌లో ఆగస్ట్ 18 రాత్రి నూతన […]

Update: 2021-08-21 08:37 GMT

దిశ, ఏపీ బ్యూరో : చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైయున్న విద్యాసంస్థలోని గెస్ట్‌హౌస్‌ను ఓ ప్రొఫెసర్ నిర్వాకం వల్ల అపవిత్రం అయ్యింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్‌లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్‌లో చోటు చేసుకుంది. ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్‌లో ఆగస్ట్ 18 రాత్రి నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ స్వర్ణ కుమారి తన పేరున గెస్ట్ హౌస్‌లో మూడు రూములు బుక్ చేసుకున్నారు. అందులో భాగంగా 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నూతన దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు. నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుమతివ్వడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 201 గదిని ఫస్ట్ నైట్‌కు పూలతో అందంగా అలంకరించడం.. ఆ కార్యక్రమానికి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రొ.స్వర్ణకుమారి తన కుమార్తె పెళ్లి జరిగిందని.. అయితే వారి హనీమూన్‌ను ఈ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మూడు రాత్రులు కూడా ఇక్కడే జరిగినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్‌గా మారడంతో వీసీ రామలింగరాజు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గెస్ట్‌హౌస్‌కు సరైన పర్యవేక్షణ లేదని తెలిసిందని ఇకపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని వీసీ రామలింగరాజు తెలిపారు.

Tags:    

Similar News