బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన బాహుబలి భామ.. నెటిజన్లు ఫిదా
దిశ, సినిమా: ‘బాహుబలి’ సినిమాలోని ఐటెం సాంగ్‌తో పాటు బాలీవుడ్ చాట్ బస్టర్ ‘దిల్‌బర్ దిల్‌బర్’తో యువ హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. అమ్మడు తాజాగా మరో హాట్ నంబర్‌తో దుమ్మురేపుతోంది. జాన్ అబ్రహం అప్‌కమింగ్ మూవీ ‘సత్యమేవ జయతే 2’ చిత్రంలోని ‘కుసు కుసు’ పాటలో తన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు తోడు సొగసైన బెల్లీ డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 2018లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సత్యమేవ జయతే’కు సీక్వెల్ తెరకెక్కించిన మేకర్స్.. లేటెస్ట్‌గా ఈ […]
దిశ, సినిమా: ‘బాహుబలి’ సినిమాలోని ఐటెం సాంగ్‌తో పాటు బాలీవుడ్ చాట్ బస్టర్ ‘దిల్‌బర్ దిల్‌బర్’తో యువ హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. అమ్మడు తాజాగా మరో హాట్ నంబర్‌తో దుమ్మురేపుతోంది. జాన్ అబ్రహం అప్‌కమింగ్ మూవీ ‘సత్యమేవ జయతే 2’ చిత్రంలోని ‘కుసు కుసు’ పాటలో తన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు తోడు సొగసైన బెల్లీ డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 2018లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సత్యమేవ జయతే’కు సీక్వెల్ తెరకెక్కించిన మేకర్స్.. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘కుసు కుసు’ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ పాటకు తనిష్క్ బగ్చీ మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ అందించగా.. జహ్రా ఎస్ ఖాన్, దేవ్ నేగీ ఆలపించారు. అన్యాయం, అధికార దుర్వినియోగంపై పోరాటమే లక్ష్యంగా తెరకెక్కిన సినిమాను యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుగా రూపొందించామని జాన్ అబ్రహం తన ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించాడు. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.