మోడీజీ.. మీ ఆలోచనకు విరుద్ధంగా GST పెంచారు : కేటీఆర్ ట్వీట్ వైరల్
దిశ, తెలంగాణ బ్యూరో : జీఎస్టీ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులైన నరేంద్ర మోడీ జీ.. జాతీయ చేనేత దినోత్సవం నాడు మీరు #Vocal4Handmade బలోపేతం గురించి మాట్లాడిన ఆలోచనకు విరుద్ధంగా, మీ ప్రభుత్వం చేనేత & వస్త్రాలపై GSTని 5 నుండి 12%కి పెంచిందని అన్నారు. ఇది పరిశ్రమకు మరణ శాసనం అవుతుందంటూ కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను రక్షించాల్సిందిగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : జీఎస్టీ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులైన నరేంద్ర మోడీ జీ.. జాతీయ చేనేత దినోత్సవం నాడు మీరు #Vocal4Handmade బలోపేతం గురించి మాట్లాడిన ఆలోచనకు విరుద్ధంగా, మీ ప్రభుత్వం చేనేత & వస్త్రాలపై GSTని 5 నుండి 12%కి పెంచిందని అన్నారు. ఇది పరిశ్రమకు మరణ శాసనం అవుతుందంటూ కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను రక్షించాల్సిందిగా ప్రధానిని అభ్యర్థిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. చేనేతను సంరక్షించడానికి కార్మికులు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారన్నారని కితాబిచ్చారు. మన దేశానికి చెందిన దేశీయ కళలు, వస్త్రాలుపై జీఎస్టీ పెంపును ఉపసంహరించుకోవాలని కోరారు.
Hon’ble @narendramodi Ji, on the national handloom day you had talked of strengthening #Vocal4Handmade
Contrary to the idea, your Govt has enhanced GST on Handlooms & Textiles from 5 to 12% which will be a death knell for the industry
Request you to intervene & save weavers pic.twitter.com/fOvT7YiLLM
— KTR (@KTRTRS) December 24, 2021