ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదు: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ భూముల రక్షణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని భూములను కాపాడాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీలైతే ప్రభుత్వ పరిధిలోని ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ […]

Update: 2020-06-27 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ భూముల రక్షణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని భూములను కాపాడాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీలైతే ప్రభుత్వ పరిధిలోని ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News