Exclusive : మిస్టీరియస్ మర్డర్ కేసులో నిందితురాలిగా కృతి

దిశ, సినిమా : అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ ఇండియన్ అడాప్టేషన్‌ రైట్స్ సొంతం చేసుకున్నారు ప్రొడ్యూసర్ నిఖిల్ ద్వివేది. ది గ్రేట్ డైరెక్టర్ క్వెంటిన్ టరాన్టినో క్లాసిక్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ రీమేక్‌కు గతేడాది లాక్‌డౌన్ నుంచే వర్క్ స్టార్ట్ కాగా అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మహిళ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీకారం, భావోద్వేగాలు నిండి ఉండగా.. ఒరిజినల్‌లో ఉమా తుర్మాన్ పోషించిన పాత్రను […]

Update: 2021-06-22 04:37 GMT

దిశ, సినిమా : అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ ఇండియన్ అడాప్టేషన్‌ రైట్స్ సొంతం చేసుకున్నారు ప్రొడ్యూసర్ నిఖిల్ ద్వివేది. ది గ్రేట్ డైరెక్టర్ క్వెంటిన్ టరాన్టినో క్లాసిక్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ రీమేక్‌కు గతేడాది లాక్‌డౌన్ నుంచే వర్క్ స్టార్ట్ కాగా అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మహిళ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీకారం, భావోద్వేగాలు నిండి ఉండగా.. ఒరిజినల్‌లో ఉమా తుర్మాన్ పోషించిన పాత్రను కృతి సనన్ చేయనుంది.

ఇప్పటికే మేకర్స్ తనతో సంప్రదింపులు జరపగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని సమాచారం. ఈ మూవీ కృతికి ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ కాగా ఇందుకోసం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంది. అనురాగ్, నిఖిల్ ద్వివేది కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను క్వెంటిన్ టరాన్టినో‌కు అంకితం ఇస్తున్నట్లు తెలిపిన మేకర్స్.. ఆయన లెగసీని సెలబ్రేట్ చేసుకుందామన్నారు.

Tags:    

Similar News