అరెస్ట్ చేసిన గంటల్లోనే కొల్లు రవీంద్రకు బెయిల్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. ఎన్నికల విధులకు ఆటకం కలిగించారనే అభియోగంతో కొల్లు రవీంద్రను ఇవాళ ఉదయం పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మచిలీపట్నంలోని కొల్లు నివాసానికి కార్యకర్తలు, అభిమానులు చేరుకుని కొల్లు అరెస్ట్‌కి నిరసనగా ఆందోళన చేపట్టారు. కొల్లు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో […]

Update: 2021-03-11 00:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. ఎన్నికల విధులకు ఆటకం కలిగించారనే అభియోగంతో కొల్లు రవీంద్రను ఇవాళ ఉదయం పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మచిలీపట్నంలోని కొల్లు నివాసానికి కార్యకర్తలు, అభిమానులు చేరుకుని కొల్లు అరెస్ట్‌కి నిరసనగా ఆందోళన చేపట్టారు.

కొల్లు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడిన కోర్టు.. పోలీసుల విచారణకు కొల్లు రవీంద్ర సహకరించాలని ఆదేశించింది.

Tags:    

Similar News