‘ధాన్యం కొనుగోలుకు షెడ్యూల్ సిద్ధం చేయండి’

దిశ‌, ఖ‌మ్మం: ధాన్యం కొనుగోలుకు గ్రామాల వారీగా షెడ్యూల్ త‌యారు చేయాల‌ని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం కలెక్టర్ ఎం.వి. రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి క‌రోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధాన్యం కొనుగోలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, తదితర అంశాలపై వ్యవసాయ, రెవెన్యూ, ఎంపీడీవో, ఏపీఎంల‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి కావలసిన సామ‌గ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే వసతుల కల్పనతో పాటు యంత్రాలను, […]

Update: 2020-03-31 10:02 GMT

దిశ‌, ఖ‌మ్మం: ధాన్యం కొనుగోలుకు గ్రామాల వారీగా షెడ్యూల్ త‌యారు చేయాల‌ని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం కలెక్టర్ ఎం.వి. రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి క‌రోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధాన్యం కొనుగోలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, తదితర అంశాలపై వ్యవసాయ, రెవెన్యూ, ఎంపీడీవో, ఏపీఎంల‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి కావలసిన సామ‌గ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే వసతుల కల్పనతో పాటు యంత్రాలను, హామాలీల‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతు సంఘాల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.100 కోట్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ల‌క్ష్యాల‌ను పూర్తి చేయ‌ని సిబ్బందిని బదిలీ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచితంగా అంద‌జేస్తున్న 12 కేజీల బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దును నేరుగా ఖాతాల్లో జ‌మ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: collector MV reddy, review meeting, corona, outbreak, revenue, MPDO, video conference

Tags:    

Similar News