కేసీఆర్ మూడేళ్లు వెంటపడితే?
దిశ, వెబ్‌డెస్క్: చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి 10 రోజులైందన్నారు. కేసీఆర్ తన వెనుక మూడేళ్లు వెంటపడితే టీఆర్‌ఎస్‌లో చేరాననే విషయం బయటపెట్టారు. తాను అనుకున్నంతగా తెలంగాణను అభివృద్ధి చేయడంలో కేసీఆర్ మార్పు తీసుకురాలేకపోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థికంగా వెనక్కిపోయిందని, కాగ్ నివేదిక కూడా ఇదే బయటపెట్టిందని కొండా విమర్శించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొండా.. కొత్త రాజకీయ పార్టీలో పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. […]
దిశ, వెబ్‌డెస్క్: చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి 10 రోజులైందన్నారు. కేసీఆర్ తన వెనుక మూడేళ్లు వెంటపడితే టీఆర్‌ఎస్‌లో చేరాననే విషయం బయటపెట్టారు. తాను అనుకున్నంతగా తెలంగాణను అభివృద్ధి చేయడంలో కేసీఆర్ మార్పు తీసుకురాలేకపోయారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆర్థికంగా వెనక్కిపోయిందని, కాగ్ నివేదిక కూడా ఇదే బయటపెట్టిందని కొండా విమర్శించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొండా.. కొత్త రాజకీయ పార్టీలో పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన అనంతరం కొత్త పార్టీపై ఆలోచన చేస్తానన్నారు.
మరోవైపు కొండా బీజేపీలో చేరే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి. తమ పార్టీలో చేరాల్సిందిగా కొండాను బీజేపీ ముఖ్యనేతలు ఆహ్వానిస్తున్నారు. మరి కొండా బీజేపీలో చేరతారా?.. లేదా కొత్త పార్టీ పెడతారా? అనేది చూడాలి.