సీఎం కేసీఆర్‌పై కొమ్మూరి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని కాంగ్రెస్ లీడర్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. గిట్టు బాట ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతూ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. దీంతో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. నల్గొండ జిల్లాలో మామిడి బీరయ్య అనే రైతు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిచిపోవడం బాధకరమన్నారు. దీంతో ఆయన అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడని […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని కాంగ్రెస్ లీడర్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. గిట్టు బాట ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతూ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. దీంతో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. నల్గొండ జిల్లాలో మామిడి బీరయ్య అనే రైతు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిచిపోవడం బాధకరమన్నారు. దీంతో ఆయన అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.
కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అంతేగాక పంట సాగుపై కూడా గడికోమాటను చెబుతున్నట్లు వివరించారు. సమైఖ్యరాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరుతుందని చెప్పి, రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నీళ్లు ,నిధులు, నియామకాలు కొరకు ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు. కచ్చితంగా నిరుద్యోగులు, రైతులు ఉసురు తగులుతుందన్నారు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలనూ నెరవేర్చలేకపోయారన్నారు.