ఇకపై గాంధీ భవన్ మెట్లు ఎక్కను.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్‎గా రేవంత్​రెడ్డి నియామకంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ పోస్టుగా మారిందని విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంకట్​రెడ్డి.. ఎయిర్​పోర్టులో మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారినవాళ్లకే కాంగ్రెస్‌లో పదవులు వస్తాయని ఆరోపించారు. రాష్ట్ర పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరగలేదని, […]

Update: 2021-06-27 06:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్‎గా రేవంత్​రెడ్డి నియామకంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ పోస్టుగా మారిందని విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంకట్​రెడ్డి.. ఎయిర్​పోర్టులో మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారినవాళ్లకే కాంగ్రెస్‌లో పదవులు వస్తాయని ఆరోపించారు. రాష్ట్ర పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరగలేదని, లక్షలాది మంది కాంగ్రెస్​ కార్యకర్తలకే అన్యాయం జరిగిందన్నారు. నాలుగు పార్టీలు మారినవాళ్లకే పోస్టులు వస్తాయని, ఒక్క పార్టీని నమ్ముకుంటే పోస్టులు రావడం లేదని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారన్నారు. తాను కూడా నాలుగు పార్టీలు మారితే, కేసుల్లో ఉంటే పోస్టు వచ్చేదని వెంకట్​రెడ్డి సెటైర్​ వేశారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా 25 ఏండ్ల రాజకీయ అనుభవం ఉందని, చిన్న మచ్చ కూడా లేదన్నారు. తన రాజకీయ భవిష్యత్తును లక్షలాది మంది కార్యకర్తలు నిర్ణయిస్తారని, ఐదుసార్లు గెలిపించిన ప్రజలు నిర్ణయిస్తారని, సోనియా, రాహుల్​పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ​ మాణిక్కం ఠాగూర్.. పీసీసీ పోస్టును అమ్ముకున్నారని మండిపడ్డారు. దీనిపై ఆధారాలున్నాయని, పూర్తి ఆధారాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనియాకు ఇస్తానని వెంకట్​రెడ్డి తెలిపారు.

తన పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​పార్టీని గెలుపు ముంగిట ఉంచుతానని, పార్లమెంట్‌లో తన గళం వినిపిస్తానన్నారు. పలు పథకాలు, నిధులు తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇచ్చారని, ఇది కేంద్ర మంత్రులు ఒప్పుకున్నారని, రింగ్​రోడ్డును మంజూరు చేయించానన్నారు. రాష్ట్ర పీసీసీ పోస్టును ఒక కార్యకర్తగా ఇస్తారని ఆశించామని, కానీ కార్యకర్తలకు పదవులు ఇవ్వరని తేలిపోయిందన్నారు. ఓటుకు నోటు కేసులో అమ్ముడుపోయినట్లు పోస్టును కూడా అలాగే అమ్ముకున్నారని, తాను ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు. ప్రజలే కుటుంబంగా రాజకీయాలు చేశానని, తాను గతంలో మంత్రి పదవిని వదులుకున్నానని ఈ సందర్భంగా కోమటిరెడ్డి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ గెలుపునకు కృషి చేస్తానన్నారు.

అది టీడీపీ పీసీసీ

రాష్ట్ర టీపీసీసీ కాదని, అది టీడీపీ పీసీసీగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలెవ్వరూ తనను కలువరాదంటూ సూచించారు. ఇప్పుడు తన నియోజకవర్గం, జిల్లా వరకే పరిమితమవుతానన్నారు. సోమవారం నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. పీసీసీ కొత్త నాయకత్వం హుజురాబాద్‌లో డిపాజిట్లు తెచ్చుకోవాలని వెంకట్​రెడ్డి సూచించారు.

Tags:    

Similar News