ఏపీలో ఉన్నా బాగుండేది: రాజగోపాల్ రెడ్డి
దిశ, హైదరాబాద్: తెలంగాణ ఎందుకు వచ్చిందన్న బాధ కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా బాగుండేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు చూస్తే జాలేస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్తోనే వచ్చింది అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చారని మండిపడ్డారు. సీఎంకు ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంకిత జ్ఞానం ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని.. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారంతో మాట్లాడటం […]
దిశ, హైదరాబాద్: తెలంగాణ ఎందుకు వచ్చిందన్న బాధ కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా బాగుండేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు చూస్తే జాలేస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్తోనే వచ్చింది అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చారని మండిపడ్డారు. సీఎంకు ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంకిత జ్ఞానం ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని.. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారంతో మాట్లాడటం సరికాదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పాటు పడిందన్నారు. తెలంగాణ ఎందుకు వచ్చింది అన్న బాధ ఇప్పుడు కలుగుతుందని.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా బాగుండేదని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో తిరుగు బాటు వస్తే సీఎంతో పాటు టీఆర్ఎస్ మంత్రులను కూడా ఎవరూ కాపాడలేరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
Tags: komatireddy rajagopal, comments, kcr, hyderabad