భారీ మార్పులతో రెండో టీ20 బరిలోకి కోహ్లీ సేన

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20లో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇండియా పేలవ ప్రదర్శనతో తొలి టీ20ను చేజార్చుకుంది. దీంతో భారీ మార్పులతో రెండో టీ 20 బరిలోకి భారత్ దిగబోతోంది. తొలి టీ20లో రోహిత్ శర్మకు బీసీసీఐ రెస్ట్ ఇవ్వగా.. రెండో టీ20 తుది జట్టులో రోహిత్ శర్మను ఆడించనున్నారు. ఇక తొలి టీ20లో భారీ […]

Update: 2021-03-13 11:50 GMT
భారీ మార్పులతో రెండో టీ20 బరిలోకి కోహ్లీ సేన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20లో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇండియా పేలవ ప్రదర్శనతో తొలి టీ20ను చేజార్చుకుంది. దీంతో భారీ మార్పులతో రెండో టీ 20 బరిలోకి భారత్ దిగబోతోంది.

తొలి టీ20లో రోహిత్ శర్మకు బీసీసీఐ రెస్ట్ ఇవ్వగా.. రెండో టీ20 తుది జట్టులో రోహిత్ శర్మను ఆడించనున్నారు. ఇక తొలి టీ20లో భారీ రన్స్ ఇచ్చిన లెగ్ స్పిన్నర్ చాహల్, పేసర్ శార్థూల్ ఠాగూర్ స్థానంలో రాహుల్ చాహర్, దీపక్ చాహర్‌లను తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఇక రెండో టీ20లో రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగనున్నాడని తెలుస్తోంది. తొలి టీ20ను ఇంగ్లండ్‌కు అప్పగించిన టీమిండియా.. రెండో టీ20లో గెలిచి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతోంది.

Tags:    

Similar News