కోహ్లీ ఓ రోజు రాత్రంతా ఏడ్చాడట.. ఎందుకో తెలుసా ?
టీమ్ ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాలెంట్ గురించి తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. ఈ తరం క్రికెటర్లలో క్రికెట్ బుక్‌లో పొందుపరిచిన షాట్లను అసాధారణ టెక్నిక్‌తో ఆడేవాళ్లలో కోహ్లీదే అగ్రస్థానం. అయితే, ప్రపంచ క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న కోహ్లీ సైతం తన కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. స్కూల్, జిల్లా స్థాయి క్రికెట్‌లో రాణించినా.. ఒకానొక సమయంలో అతడిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయలేదట. ఆ సమయంలో నిస్సహాయంగా […]
టీమ్ ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాలెంట్ గురించి తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. ఈ తరం క్రికెటర్లలో క్రికెట్ బుక్‌లో పొందుపరిచిన షాట్లను అసాధారణ టెక్నిక్‌తో ఆడేవాళ్లలో కోహ్లీదే అగ్రస్థానం. అయితే, ప్రపంచ క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న కోహ్లీ సైతం తన కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. స్కూల్, జిల్లా స్థాయి క్రికెట్‌లో రాణించినా.. ఒకానొక సమయంలో అతడిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయలేదట. ఆ సమయంలో నిస్సహాయంగా ఒక రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నట్లు కోహ్లీ చెప్పాడు. ‘అసలు నేనెందుకు ఎంపిక కాలేదో చెప్పండి’ అంటూ కోచ్‌ను ప్రశ్నిస్తూ ఏడుస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ‘అన్అకాడమీ’ నిర్వహించిన ఆన్‌లైన్ క్లాసులో కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు.
‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభంలోనూ ఒక ప్రయోజనం ఉంది. మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగాయి, అంతే కాకుండా సమాజంలో ఇతరుల పట్ల జాలి, కరుణతో ఉంటున్నారని’ కోహ్లీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రస్తుతం కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసుల పట్ల చూపిస్తున్న కృతజ్ఞతా భావాన్ని.. ఈ సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత కూడా ఇలాగే కొనసాగించాలని వారిద్దరూ ఆశించారు. ‘కరోనాతో మనం ఒక పాఠం నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. మాకైతే అందరం ఇప్పుడు ఏకమవుతున్నాం అనే భావన కలుగుతుందని’ విరుష్క జంట పేర్కొంది.
Tags :Virat Kohli, Anushka sharma, Crying, Corona crisis, video class