వీవో బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ
దిశ, స్పోర్ట్స్ : ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వీవో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వీవో.. ఇకపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని బుధవారం ప్రకటించింది. ‘మా కెమేరా ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ (సీఈవో)గా వన్ అండ్ వోన్లీ విరాట్‌ను ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నాము’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నది. వీవో నుంచి వచ్చే పలు మోడల్ […]
దిశ, స్పోర్ట్స్ : ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వీవో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వీవో.. ఇకపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని బుధవారం ప్రకటించింది. ‘మా కెమేరా ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ (సీఈవో)గా వన్ అండ్ వోన్లీ విరాట్‌ను ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నాము’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నది. వీవో నుంచి వచ్చే పలు మోడల్ ఫోన్లను ప్రమోట్ చేయడమే కాకుండా.. వాటిపై అవగాహన కల్పించేలా కోహ్లీతో కార్యక్రమాలు రూపొందించనున్నట్లు వీవో ప్రతినిధులు తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఏడాదికి రూ. 440 కోట్లను బీసీసీఐకి చెల్లించేలా వీవో మూడేళ్ల క్రితమే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.