మంత్రి నిరంజన్ రెడ్డికి లేఖ రాసిన కోదండరెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి.నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌లకు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో పలు ఆంశలు తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నా కూడా పంట నష్ట గణన జరగడం లేదన్నారు. ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి.నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌లకు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో పలు ఆంశలు తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నా కూడా పంట నష్ట గణన జరగడం లేదన్నారు. ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో భారీ వడగండ్ల వర్షానికి అన్ని జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట పరిశీలించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పంట నష్ట పరిహారంపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వలన్నారు. ప్రకృతి వైపరిత్యం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అత్యవసర నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Tags: letter, kodhandaareddy, minister niranjan reddy, farmers,