దర్జాగా కోదాడ చెరువు కబ్జా.. కన్నెత్తి చూడని యంత్రాంగం..

దిశ, కోదాడ: నిజాం కాలానికి ముందు నుంచి కోదాడ కల్పతరువుగా సాగు, తాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. వందలాది మంది మత్స్య కార్మిక కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న చెరువు క్రమంగా కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్ళిపోతోంది. అధికారుల ఉదాసీనతో, కోట్ల విలువైన చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతున్నాయి. ప్రతి ఏటా చెరువు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకుండా, తమకు ఏమి తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోదాడ నుండి రాంరెడ్డి పాలెం వెళ్లే […]

Update: 2021-12-20 00:04 GMT

దిశ, కోదాడ: నిజాం కాలానికి ముందు నుంచి కోదాడ కల్పతరువుగా సాగు, తాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. వందలాది మంది మత్స్య కార్మిక కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న చెరువు క్రమంగా కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్ళిపోతోంది. అధికారుల ఉదాసీనతో, కోట్ల విలువైన చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతున్నాయి. ప్రతి ఏటా చెరువు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకుండా, తమకు ఏమి తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కోదాడ నుండి రాంరెడ్డి పాలెం వెళ్లే రహదారి పక్కన సుమారు 500 గజాల చెరువు భూమిని పెన్సింగ్ వేసి మరి ఆక్రమిస్తున్నారు. అధికారుల కళ్లముందే ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 145 లో 700 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు ఉండగా ప్రస్తుతం సుమారు 100 ఎకరాల వరకు కబ్జాకు గురైంది.

సర్వే ఏమైంది?

కోదాడ పెద్ద చెరువును సమగ్రంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ రిజ్వి 2009 లో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆ అధికారి ఆధ్వర్యంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ లు ఐబీ అధికారులు కలిసి రెండు బృందాలుగా సర్వే చేశారు. ఆ సర్వే చేసి వాటిని ఆధారంగా పెగ్ మార్కులు గుర్తించారు. సర్వే లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. ఆక్రమణలకు గురైన స్థలాలపై ఇంత వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత చెలరేగిపోతున్న భూబకాసురులు తమకు అడ్డు అదుపు లేదు అన్నట్లుగా పెన్సింగ్ వేసి మరి తలలో ఆక్రమించుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజాం కాలం నుండి ఎంతోమంది మత్స్య కార్మికులకు, రైతులకు జీవన ఉపాధి కల్పిస్తున్న పెద్ద చెరువును కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

నిద్రావస్థలో అధికారులు

కోదాడ చెరువు పెద్ద చెరువు శిఖం భూమి కబ్జా చేస్తున్న అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారని అన్నారు. అధికారుల సమన్వయ లోపంతో కబ్జా అవుతుందని ఆరోపించారు. ఎఫ్ టి ఎల్ ల్యాండ్ తర్వాత కూడా బఫర్ జోన్ అని 500 మీటర్ల వరకు ఉంటుందని అయినా కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నారన్నారు. గతంలో టాస్క్ఫోర్స్ కమిటీ పెట్టినా అందులో జిల్లా కలెక్టర్ రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు ఉన్న పట్టించుకున్న పాపానికి లేదని అన్నారు.

—కుదరవల్లి బసవయ్య (సామాజిక కార్యకర్త)

కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటా.. తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ

కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోవడం కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ అన్నారు. సర్వేయర్ ని ఇరిగేషన్ అధికారులను పంపించి ఎఫ్ టి ఎల్ హద్దులు బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. కబ్జా చేసిన వారు ఎవరైనా సహించేది లేదని వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.

Tags:    

Similar News