నీ అవినీతి చిట్టా విప్పితే తట్టుకోలేవ్.. ఎంపీ ఉత్తమ్‌పై ‘బొల్లం’ సంచలన వ్యాఖ్యలు

దిశ, కోదాడ : భువనగిరి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బొల్లం మల్లయ్య యాదవ్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపణ చేయాలని లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆరోపణల నిరూపణకు తాను ఎక్కడికైనా రావడానికి సిద్ధమేనని , ఆరోపణలు నిరూపించాలి లేదా క్షమాపణలు చెప్పాలన్నారు. రైతు వేదికలు అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ ఉన్న గ్రామాల సర్పంచులు […]

Update: 2021-10-22 06:42 GMT

దిశ, కోదాడ : భువనగిరి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బొల్లం మల్లయ్య యాదవ్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపణ చేయాలని లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆరోపణల నిరూపణకు తాను ఎక్కడికైనా రావడానికి సిద్ధమేనని , ఆరోపణలు నిరూపించాలి లేదా క్షమాపణలు చెప్పాలన్నారు. రైతు వేదికలు అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ ఉన్న గ్రామాల సర్పంచులు కట్టారని ఏ సర్పంచ్ నైనా డబ్బు అడిగినట్లు నిరూపించ మన్నారు. భూములు అమ్ముకుని ప్రజాసేవకు వచ్చానని, ఎమ్మెల్యే కాకముందే తనకు ఆస్తి ఉందన్నారు.

ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉందని ఎమ్మె్ల్యే మల్లయ్య యాదవ్.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. సోలార్ ప్రాజెక్టులు, దుబాయ్‌లో పరిశ్రమలు ఇదంతా నీ అవినీతి సంపాదన కాదా అని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అసెంబ్లీలో ఈ విషయమై చర్చకు రాగా, సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశిస్తే కాళ్లా వేళ్లా పడి ఆపుకున్నాడని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి కోదాడ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని అసోసియేషన్లు, పబ్లిక్ మీటింగ్, పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు చందాలు వసూలు చేసిన చరిత్ర ఉత్తమ్‌కు ఉందన్నారు.

కోదాడలో రేషన్ బియ్యం అమ్మించిన చరిత్ర నీదే అని ప్రశ్నించారు.మద్యం సిండికేట్లను పక్కన పెట్టుకున్న ఉత్తమ్‌కు తనను విమర్శించే హక్కు లేదన్నారు. నాడు, నేడు ప్రజాబలంతోనే నియోజకవర్గ వాస్తవ్యుడుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ అందిస్తుంటే తనపై బురద చల్లాలని ప్రయత్నిస్తే ఊరుకోమని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు నిరూపించే కోదాడలో కాలు పెట్టాలని, లేనిపక్షంలో ఎక్కడుంటే అక్కడికి వెళ్లి అడ్డుకుంటానని ఘాటుగా బదులిచ్చారు. అర్హులైన వారందరికీ రైతుబంధు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకే పథకాలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్, ఎంపీపీ చింతా కవిత రాధా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరావు, మండల పార్టీ అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, బుర్ర పుల్లారెడ్డి, ఒంటి పులి నాగరాజు, నల్లపాటి శ్రీనివాసరావు, బత్తుల ఉపేందర్, గంధం పాండు, సంపేట ఉపేందర్ గౌడ్, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్ ,మామిడి రామారావు, షేక్. మదర్, దేవ బత్తిని సురేష్, పైడిమర్రి సత్య బాబు, కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు కట్ట బోయిన శ్రీనివాస్ యాదవ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News