‘ఆ పార్టీకి భయపడే కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని మరిచారు’
దిశ, ఆందోల్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని.. ముఖ్యంగా మజ్లిస్ పార్టీకి కీలుబొమ్మగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిజాం నియంతృత్వ పోకడలతో కుటుంబ పాలన నడిపిస్తోన్న కల్వకుంట్ల ఫ్యామిలీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. శనివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై.. స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా […]
దిశ, ఆందోల్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని.. ముఖ్యంగా మజ్లిస్ పార్టీకి కీలుబొమ్మగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిజాం నియంతృత్వ పోకడలతో కుటుంబ పాలన నడిపిస్తోన్న కల్వకుంట్ల ఫ్యామిలీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. శనివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై.. స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాల్సింది పోయి.. మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ వెనక్కి తగ్గారని విమర్శలు చేశారు. అందుకే ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.