ఇలాంటి కింగ్ కోబ్రాను మీరు ఎప్పుడూ చూసి ఉండరూ.. ఎక్కడంటే ?

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. చందలంగి అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుండటంతో అటవీశాఖ అధికారులు వాటిని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. వాటిని గిరిజన గ్రామాల నుంచి తరిమేస్తుండగా కింగ్ కోబ్రా పిల్ల ఒక్కసారిగా బుసలు కొట్టింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు. కింగ్ కోబ్రా లేదని తాము అనుకుంటున్నామని అయితే చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ […]

Update: 2021-08-23 10:08 GMT
king-cobra
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. చందలంగి అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుండటంతో అటవీశాఖ అధికారులు వాటిని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. వాటిని గిరిజన గ్రామాల నుంచి తరిమేస్తుండగా కింగ్ కోబ్రా పిల్ల ఒక్కసారిగా బుసలు కొట్టింది.

దీంతో అటవీ శాఖ అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు. కింగ్ కోబ్రా లేదని తాము అనుకుంటున్నామని అయితే చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా ఉందని చెప్పుకొచ్చారు. ఇది చిన్న కింగ్ కోబ్రా అని దీని తల్లి కూడా ఇక్కడే ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కింగ్ కోబ్రా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News