బిలియనీర్ లిస్ట్‌లో చేరిపోయిన హీరోయిన్
దిశ, సినిమా : హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియన్ బిలియనీర్ లిస్ట్‌లో చేరిపోయింది. రియాలిటీ స్టార్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అయిన కిమ్‌ను ఫోర్బ్స్ అధికారికంగా ఈ లిస్ట్‌లో చేర్చింది. కాగా ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్‌లో 780 మిలియన్ డాలర్ల విలువైన ప్రాపర్టీతో ఉన్న హీరోయిన్.. తాజాగా 1 బిలియన్ డాలర్ల ప్రాపర్టీని గెయిన్ చేసింది. తన బ్యూటీ అండ్ షేప్‌వేర్ ప్రొడక్ట్ కంపెనీలు ఈ సక్సెస్‌లో బిగ్ రోల్ ప్లే చేయగా.. టెలివిజన్, ఎండార్స్‌మెంట్ డీల్స్, […]
దిశ, సినిమా : హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియన్ బిలియనీర్ లిస్ట్‌లో చేరిపోయింది. రియాలిటీ స్టార్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అయిన కిమ్‌ను ఫోర్బ్స్ అధికారికంగా ఈ లిస్ట్‌లో చేర్చింది. కాగా ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్‌లో 780 మిలియన్ డాలర్ల విలువైన ప్రాపర్టీతో ఉన్న హీరోయిన్.. తాజాగా 1 బిలియన్ డాలర్ల ప్రాపర్టీని గెయిన్ చేసింది. తన బ్యూటీ అండ్ షేప్‌వేర్ ప్రొడక్ట్ కంపెనీలు ఈ సక్సెస్‌లో బిగ్ రోల్ ప్లే చేయగా.. టెలివిజన్, ఎండార్స్‌మెంట్ డీల్స్, స్మాలర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కలిసి తనను బిలియనీర్‌గా నిలబెట్టాయి. ఈ సందర్భంగా కిమ్ తన కేకేడబ్ల్యూ, స్కిమ్స్ ప్రొడక్ట్స్‌ను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.
కిమ్‌కు సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉండగా.. అది తన లేటెస్ట్ వెంచర్ స్కిమ్స్ బెస్ట్ రిజల్ట్ పొందేందుకు మార్కెటింగ్‌లా పనిచేసింది. ట్విట్టర్‌లో 69.6 మిలియన్ ఫాలోవర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 213 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కిమ్.. కరోనా టైమ్‌లో తన ప్రొడక్ట్స్ మార్కెట్ చేసుకునేందుకు సోషల్ మీడియానే యూజ్ చేసింది. అంతేకాదు పరిస్థితులకు అనుగుణంగా కొవిడ్ సమయంలో షేప్‌వేర్ డైలీవేర్‌పై ఫోకస్ చేంజ్ చేసి ట్రెమండస్ సక్సెస్ అందుకుంది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం స్కిమ్స్ వాటా 225 మిలియన్ డాలర్లు కాగా.. ఇతర ఆదాయ వనరులతో కలిపి కిమ్స్ ప్రాపర్టీ నికర విలువను 1 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు సరిపోయింది.