నిమిషాల వ్యవధిలో కిడ్నాపర్లు అరెస్ట్
దిశ, వెబ్డెస్క్: తిరుమలలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఎస్పీటీ కాటేజ్ దగ్గర నలుగురు దుండగులు కారులో వచ్చి హనుమంతరావును కిడ్నాప్ చేశారు. హనుమంతరావు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అలిపిరి తనిఖీ కేంద్రాన్ని అప్రమత్తం చేసి నిందితులను […]
దిశ, వెబ్డెస్క్: తిరుమలలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఎస్పీటీ కాటేజ్ దగ్గర నలుగురు దుండగులు కారులో వచ్చి హనుమంతరావును కిడ్నాప్ చేశారు.
హనుమంతరావు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అలిపిరి తనిఖీ కేంద్రాన్ని అప్రమత్తం చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన కె.శ్రీనివాస్, మారుతి, పుట్టపర్తికి చెందిన పి.కుమార్, చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన సురేష్‌లుగా గుర్తించారు. వ్యాపారం నిర్వహించేందుకు హనుమంతరావు శ్రీనివాస్ వద్ద రూ.25 లక్షలు తీసుకున్నారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోవటంతో హనుమంతరావును కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.