దీక్షిత్ కిడ్నాప్ కేసు విషాదాంతం

దిశ, వెబ్‎డెస్క్: మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. మహబూబాబాద్‎కు 5 కిలోమీటర్ల దూరంలోని గుట్టలో దీక్షిత్ మృతదేహం లభ్యమైంది. కిడ్నాపర్లు బాలుడికి మత్తు మందు ఇచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. గత ఆదివారం రాత్రి దీక్షిత్‎ను కిడ్నాప్ చేసిన దుండగులు.. బాలుడి కుటుంబసభ్యులకు […]

Update: 2020-10-21 23:15 GMT

దిశ, వెబ్‎డెస్క్: మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. మహబూబాబాద్‎కు 5 కిలోమీటర్ల దూరంలోని గుట్టలో దీక్షిత్ మృతదేహం లభ్యమైంది. కిడ్నాపర్లు బాలుడికి మత్తు మందు ఇచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

గత ఆదివారం రాత్రి దీక్షిత్‎ను కిడ్నాప్ చేసిన దుండగులు.. బాలుడి కుటుంబసభ్యులకు ఇంటర్నెట్ కాల్ చేసి రూ.45 లక్షల డబ్బును డిమాండ్ చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, కిడ్నాపర్ ఇంటర్నెట్ కాల్ చేయడంతో ట్రేస్ అవుట్ చేయడం కష్టమైంది. గత రాత్రి డబ్బుతో బాలుడి తండ్రి కిడ్నాపర్లు చెప్పిన చోట ఎదురుచూసినా వారు రాలేదు.

Tags:    

Similar News