కైరా.. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ
బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ.. గతేడాది ‘గుడ్ న్యూస్’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అక్షయ్‌తో లక్ష్మీబాంబ్ సినిమాలోనూ నటించగా.. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలవనుంది. ఇక ఈ బ్యూటీ 2020లో ‘భూల్ భూలయ్యా’ సీక్వెల్లో నటిస్తోంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్నా సరే, అభిమానులతో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకునే కైరా.. తాజాగా ‘క్వారంటైన్ వర్సెస్ రియాలిటీ’ […]
బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ.. గతేడాది ‘గుడ్ న్యూస్’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అక్షయ్‌తో లక్ష్మీబాంబ్ సినిమాలోనూ నటించగా.. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలవనుంది. ఇక ఈ బ్యూటీ 2020లో ‘భూల్ భూలయ్యా’ సీక్వెల్లో నటిస్తోంది. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్నా సరే, అభిమానులతో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకునే కైరా.. తాజాగా ‘క్వారంటైన్ వర్సెస్ రియాలిటీ’ అనే వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో.. ఇంట్లోనే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్న కైరా.. ర్యాంప్ వాక్‌ను బాగా మిస్ అవుతున్నట్లుంది. ఈ క్రమంలో లేటెస్ట్గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో గతంలో గ్లామరస్‌గా రెడీ అయ్యి, ర్యాంప్ వాక్ చేసిన వీడియో బిట్‌తో పాటు ‘క్వారంటైన్ టైమ్‌లో ఫేస్ మాస్క్, సేఫ్టీ గేర్ వేసుకుని బయటకెళ్తున్న బిట్‌ను యాడ్ చేసి, ‘మనం ఊహించింది వేరైతే.. జరిగితే మాత్రం ఇదే’ అని పేర్కొంది.
ఇక క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లో వర్కవుట్స్ చేస్తూ.. బేకింగ్ కూడా చేస్తోంది కైరా. ఇటీవలే తన ఫ్యామిలీ కోసం.. లిప్ స్మాకింగ్ కుకీస్ చేసి పెట్టింది. ఫ్యామిలీ మొత్తం కుకీస్ తిని.. కైరా కుకింగ్ స్కిల్‌ను తెగ మెచ్చుకున్నారు. కైరా యంగర్ బ్రదర్.. తన కుకీస్‌కు థ్యాంకింగ్ నోట్ కూడా రాస్తూ.. ‘బెస్ట్ డిజర్ట్ ఇన్ ద హౌస్’ అంటూ కైరాను అభినందించాడు.