50 వేల బుకింగ్‌లను సాధించిన కియా సొనెట్
దిశ, వెబ్‌డెస్క్: కియా మోటార్స్ (kia Motors)ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ సొనెట్ (Compact SUV Sonet)ను ప్రారంభించిన నాటి నుంచి 50 వేలకు పైగా బుకింగ్ (Bookings)లను సాధించినట్టు బుధవారం ప్రకటించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రికార్డు బుకింగ్‌లను సాధించి గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగష్టు 20న బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే సొనెట్ మోడల్ కారు (Sonet Model car) 50 వేల బుకింగ్‌ల మైలురాయిని […]
దిశ, వెబ్‌డెస్క్: కియా మోటార్స్ (kia Motors)ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ సొనెట్ (Compact SUV Sonet)ను ప్రారంభించిన నాటి నుంచి 50 వేలకు పైగా బుకింగ్ (Bookings)లను సాధించినట్టు బుధవారం ప్రకటించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రికార్డు బుకింగ్‌లను సాధించి గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగష్టు 20న బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే సొనెట్ మోడల్ కారు (Sonet Model car) 50 వేల బుకింగ్‌ల మైలురాయిని దాటినట్టు కంపెనీ పేర్కొంది.
‘ కియా ఉత్పత్తులకు భారత్‌లోని వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. బుకింగ్‌లను అందుకున్నప్పటి నుంచి సగటున ప్రతి మూడు నిమిషాలకు రెండు ఆర్డర్లు అందుకున్నట్టు కియా మోటార్స్ ఇండియా (Kia MOtors India)వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో 9,266 కియా సొనెట్ యూనిట్లను అందించామని, ఈ మోడల్ ధర ప్రకటించి, మార్కెట్లోకి విడుదల చేసిన 12 రోజుల వ్యవధిలోనే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అగ్రగామిగా నిలించిందని కంపెనీ తెలిపింది. కాగా, కియా సొనెట్ మోడల్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో లభిస్తోంది. దీని ధర రూ. 6.71 లక్షల నుంచి రూ. 11.99 లక్షల మధ్య లభిస్తోందని కంపెనీ పేర్కొంది.