రాముని కన్నా మోదీ పెద్దవాడయ్యారు : ఖుష్బూ

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభఘట్టాన్ని పురస్కరించుకుని.. యావత్ రామ భక్తులు, హిందు బంధువులు తమ దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారంటూ కీర్తించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులంతా దీన్ని స్వాగతించారు. అయితే, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు.. ఖుష్బూ ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించారు. రాముని […]

Update: 2020-08-06 03:11 GMT
రాముని కన్నా మోదీ పెద్దవాడయ్యారు : ఖుష్బూ
  • whatsapp icon

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభఘట్టాన్ని పురస్కరించుకుని.. యావత్ రామ భక్తులు, హిందు బంధువులు తమ దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారంటూ కీర్తించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులంతా దీన్ని స్వాగతించారు. అయితే, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు.. ఖుష్బూ ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించారు.

రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం మరో మూడున్నరేళ్లలో పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. అయితే, ప్రధాని మోదీ.. చిన్న బాలుడైన రాముడ్ని ఆ అయోధ్య మందిరానికి చేయి పట్టుకుని తీసుకుపోతున్న ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తుండగా.. ఈ ఫొటోను నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ట్వీట్ చేస్తూ.. ‘ఇప్పుడు రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారన్నమాట. ఏం కలియుగం’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఖుష్బూ ‘నాకు మ్యూట్ బటన్ అంటే ఇష్టం’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యలకు స్పందించింది.

Tags:    

Similar News