మహా గణపతి శోభయాత్ర షురూ.. భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మహా గణపతి(ఖైరతాబాద్ గణేషుడు) నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఎటు చూసినా గణనాథుల సందడే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మహా గణపతి(ఖైరతాబాద్ గణేషుడు) నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఎటు చూసినా గణనాథుల సందడే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
చాంద్రాయణగుట్ట, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ లిబర్టీ, హుస్సేన్ సాగర్ వరకూ ఉన్న రోడ్డు మార్గంలో విగ్రహాలు తీసుకొస్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతి లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సమీపంలోని బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్ పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.