ఈసారి అదిరిపోనున్న ఖైరతాబాద్ గణేషుడు
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి అనగానే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు టక్కున ఖైరతాబాద్ గణేషుడు గుర్తొస్తాడు. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కరోనా కారణంగా రెండేండ్ల నుంచి డీలా పడిపోయాయి. గణేశ్ మంటపాలు భారీగా తగ్గడమే కాకుండా.. ఏమాత్రం సందడి లేకుండా, నిరాడంబరంగా జరిగిపోయాయి. తాజాగా.. ఈ ఏడాది పండుగ సమీపిస్తుండటంతో ఈసారి ఎలాగైన అట్టహాసంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాటుకు […]
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి అనగానే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు టక్కున ఖైరతాబాద్ గణేషుడు గుర్తొస్తాడు. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కరోనా కారణంగా రెండేండ్ల నుంచి డీలా పడిపోయాయి. గణేశ్ మంటపాలు భారీగా తగ్గడమే కాకుండా.. ఏమాత్రం సందడి లేకుండా, నిరాడంబరంగా జరిగిపోయాయి. తాజాగా.. ఈ ఏడాది పండుగ సమీపిస్తుండటంతో ఈసారి ఎలాగైన అట్టహాసంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీ కర్రపూజ చేసింది.
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం కొంతమంది కమిటీ సభ్యులతోనే ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈసారి పది తలలతో ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇవ్వనున్నట్లు కమిటీ వెల్లడించింది. ఎన్ని అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు చేయాలనేది త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాగా, గతేడాది కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందిన కారణంగా 18 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేసి ఉత్సవాలను నిర్వహించారు.