కేజీఎఫ్ చాప్టర్-2పై యశ్ కామెంట్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం.. కేజీఎఫ్. యశ్‌ను నేషనల్ లెవల్ హీరోను చేసిన ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో మూవీ యూనిట్ ప్రకటించిన తేదీకి సినిమా విడుదల అవుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కేజీఎఫ్ చాప్టర్ 2 ఓటీటీలో రిలీజ్ అవుతుందా? లేక థియేటర్స్‌లో విడుదల […]

Update: 2020-06-13 07:11 GMT

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం.. కేజీఎఫ్. యశ్‌ను నేషనల్ లెవల్ హీరోను చేసిన ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో మూవీ యూనిట్ ప్రకటించిన తేదీకి సినిమా విడుదల అవుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కేజీఎఫ్ చాప్టర్ 2 ఓటీటీలో రిలీజ్ అవుతుందా? లేక థియేటర్స్‌లో విడుదల కానుందా అనే సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది.

కాగా ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు కథానాయకుడు యశ్. ఇన్‌స్టాగ్రాం లైవ్ చాట్‌లో పాల్గొన్న యశ్.. కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి పార్ట్‌కు మించిన స్క్రిప్ట్‌తో సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. అభిమానుల అంచనాలు అందుకునేలా సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందని.. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పైనే సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశాడు. ఓటిటీలో చిత్రం విడుదలయ్యే చాన్స్ లేదన్న యశ్.. అనుకున్న టైమ్‌కు అంటే అక్టోబర్ 23న సినిమా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని తెలిపాడు. జులైలో షూటింగ్‌కు అనుమతి దొరికినా చాలు.. ప్రేక్షకులను నిరాశపరచమని హామీ ఇచ్చారు యశ్. హోంబెల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రావు రమేష్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News