ఎంపీ రఘురామ అనర్హతపై లోక్‌సభ స్పీకర్ కీలక ప్రకటన
దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ స్పందించారు. రఘురామపై అనర్హత వేటు వేయాలా వద్దా అనేది నిర్ణయించేందుకు ఓ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పీకర్ తెలిపారు. ఫిర్యాదు పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపైనా […]
దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ స్పందించారు. రఘురామపై అనర్హత వేటు వేయాలా వద్దా అనేది నిర్ణయించేందుకు ఓ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పీకర్ తెలిపారు. ఫిర్యాదు పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు.
ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపైనా స్పందించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలని ఓం బిర్లా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.