స్వామి కేశవానంద భారతి ఇకలేరు..

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రం ఉత్తరాన కాసర్‌ గౌడ్‌లోని ఎదనీర్ మఠ రక్షకుడిగా ఉన్న స్వామి కేశవానంద భారతి(79) ఆదివారం ఉదయం కన్నుమూశారు. సుప్రీం కోర్టులో స్వామి కేశవానంద భారతి దాఖలు చేసిన కేసు చరిత్రాత్మక మైనది. దీన్నే ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం’ కేసుగా ఇప్పటికి చెప్పుకుంటారు. చాలా కేసుల్లో ఇదే ప్రాతిపదికగా నిలుస్తోంది. 1973సంవత్సరంలో దాఖలైన ఈ కేసులో.. ఆస్తులపై రాజ్యాంగ బద్ధంగా లభించే హక్కుల ప్రస్తావన ఉంటుంది. అద్వైతాన్ని పాటించే […]

Update: 2020-09-06 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కేరళ రాష్ట్రం ఉత్తరాన కాసర్‌ గౌడ్‌లోని ఎదనీర్ మఠ రక్షకుడిగా ఉన్న స్వామి కేశవానంద భారతి(79) ఆదివారం ఉదయం కన్నుమూశారు. సుప్రీం కోర్టులో స్వామి కేశవానంద భారతి దాఖలు చేసిన కేసు చరిత్రాత్మక మైనది. దీన్నే ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం’ కేసుగా ఇప్పటికి చెప్పుకుంటారు.
చాలా కేసుల్లో ఇదే ప్రాతిపదికగా నిలుస్తోంది.

1973సంవత్సరంలో దాఖలైన ఈ కేసులో.. ఆస్తులపై రాజ్యాంగ బద్ధంగా లభించే హక్కుల ప్రస్తావన ఉంటుంది. అద్వైతాన్ని పాటించే భారతీ స్వామి స్వయంగా 1972లో ఈ కేసు వేశారు. కేరళ ప్రభుత్వం మఠ ఆస్తులను టేకోవర్ చేసుకుంటుంటే, దానికి వ్యతిరేకంగా ఆయన 29 ఏళ్ల వయసులో కేసు వేశారు. అది కాస్త సంచలనం రేపింది.ఆ సమయంలో కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో పలు సవరణలు చేసింది. దాంతో తీర్పు కేరళ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది.

ఆ సమయంలో సీనియర్ లాయర్ ‘నానీ పాల్ఖీవాలా’ భారతి తరపున వాదించారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సర్వమిత్ర సిక్రీ ఈ కేసు విచారణకు 12 మంది జడ్జిల ప్యానెల్‌ను నియమించారు. 68 రోజుల పాటూ కేసు విచారణ సాగింది. 1972 అక్టోబర్ 31 న విచారణ మొదలై 1973 మార్చి 23న ముగిసింది. 1973 ఏప్రిల్ 24న రాజ్యాంగ ధర్మాసనం ఫైనల్ తీర్పు వెలువరించింది. అందులో రాజ్యాంగ మూల సూత్రాల్ని పార్లమెంట్ మార్చడానికి వీల్లేదని పేర్కొంది. ఆ తీర్పుకు అనుకూలంగా 7గురు జడ్జిలు మద్దతు పలకగా.. 6గురు జడ్జిలు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో కేశవానంద భారతి స్వామి గెలుపు సాధించడమే కాకుండా, మఠం ఆస్తుల్ని కాపాడగలిగారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు చరిత్రలో ఎక్కువ రోజులు విచారణ జరిగిన కేసుగా ఇది నిలిచింది. కేశవానంద భారతి తర్వాత అయోధ్య రామ మందిరం కేసు మళ్లీ అంతగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News