విరాట్ కోహ్లీ, తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు
తిరువనంతపురం: ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్ బ్యాన్ చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ కేరళ హైకోర్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినీ తార తమన్నా భాటియా, యాక్టర్ అజు వర్గీస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురూ ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌ను అందిస్తున్న వేదికలను సమర్థించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఒక సామాజిక రుగ్మతగా మారుతున్నదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది. ఆన్‌లైన్ రమ్మీ ఆటలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని నియంత్రచడం […]
తిరువనంతపురం: ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్ బ్యాన్ చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ కేరళ హైకోర్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినీ తార తమన్నా భాటియా, యాక్టర్ అజు వర్గీస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురూ ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌ను అందిస్తున్న వేదికలను సమర్థించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఒక సామాజిక రుగ్మతగా మారుతున్నదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది.
ఆన్‌లైన్ రమ్మీ ఆటలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని నియంత్రచడం కష్టసాధ్యమని పిటిషనర్ తెలిపారు. అలాంటి ప్లాట్‌ఫామ్స్ సెలెబ్రిటీలను ఉపయోగించుకుని యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ క్రమంలోనే సెలబ్రిటీలతో వాటిని సమర్థింపచేస్తున్నాయని పేర్కొన్నారు. యువతను ఆకట్టుకుని వారిని ఆర్థికంగా మోసం చేస్తున్నాయని వివరించారు. ఈ గేమ్‌లను అందిస్తున్న ప్లే గేమ్ 24/7, మొబైల్ ప్రీమియర్ లీగ్‌లకూ నోటీసులు పంపింది. మొబైల్ ప్రీమియర్ లీగ్‌కు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, తమన్నా ప్రచారకర్తగా చేశారు.