ఓ వైపు కరోనా.. మరోవైపు బర్డ్‌ఫ్లూ
కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. వైరస్ ప్రభావం భారతదేశంలో గట్టిగానే కనిపిస్తుంది. అయితే కేరళలో కూడా కరోనా ఎఫ్టెక్ట్ ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో కేరళలో బర్డ్‌ఫ్లూ భూతం మరింత కలవరపెడుతోంది. తాజాగా పరప్పనగడిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వేల సంఖ్యల్లో కోళ్లను చంపేందుకు అక్కడి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని హరించేందకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఇక పరప్పనగడిలో ఉన్న అన్ని పౌల్ట్రీలలో కోళ్లను వైద్య […]
కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. వైరస్ ప్రభావం భారతదేశంలో గట్టిగానే కనిపిస్తుంది. అయితే కేరళలో కూడా కరోనా ఎఫ్టెక్ట్ ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో కేరళలో బర్డ్‌ఫ్లూ భూతం మరింత కలవరపెడుతోంది. తాజాగా పరప్పనగడిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వేల సంఖ్యల్లో కోళ్లను చంపేందుకు అక్కడి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని హరించేందకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఇక పరప్పనగడిలో ఉన్న అన్ని పౌల్ట్రీలలో కోళ్లను వైద్య అధికారులు పరీక్షిస్తున్నారు. బర్డ్‌ఫ్లూకు కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు ఉన్న పౌల్ట్రీలలో అన్ని కోళ్లను చంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుండగానే.. మరో వైపు బర్డ్‌ఫ్లూ అక్కడి ప్రజలను వణికిస్తోంది.
Tags: Kill chickens, govt. orders, carona, bird flu, effect, kerala