ఉద్యోగాలు వదిలి ఊర్లు తిరుగుతున్న కేరళ జంట

దిశ, ఫీచర్స్ : పోటీ ప్రపంచంలో మనగలగాలంటే కాలంతో పరుగెత్తక తప్పదు. ఒక్కసారి రేసులో వెనకబడ్డామంటే మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు నిత్యం ఆఫీసు పనులతో సతమవుతూ, జీవితంలో కొత్తదనాన్ని మిస్ అవుతుంటారు. 9 to 5 జాబ్‌లు, రెగ్యులర్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం ట్రావెలింగ్, రోడ్ ట్రిప్స్ వెళ్లాలనుకున్నప్పటికీ పని ఒత్తిడిలో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉంటారు. కానీ తమ కలల సాకారానికి చేస్తున్న ఉద్యోగాలను […]

Update: 2021-10-05 02:45 GMT

దిశ, ఫీచర్స్ : పోటీ ప్రపంచంలో మనగలగాలంటే కాలంతో పరుగెత్తక తప్పదు. ఒక్కసారి రేసులో వెనకబడ్డామంటే మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు నిత్యం ఆఫీసు పనులతో సతమవుతూ, జీవితంలో కొత్తదనాన్ని మిస్ అవుతుంటారు. 9 to 5 జాబ్‌లు, రెగ్యులర్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం ట్రావెలింగ్, రోడ్ ట్రిప్స్ వెళ్లాలనుకున్నప్పటికీ పని ఒత్తిడిలో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉంటారు. కానీ తమ కలల సాకారానికి చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలిపెట్టిన ఓ కేరళ జంట.. అనవసర భయాలు పక్కనబెట్టి దేశం మొత్తం చుట్టేస్తుండటం విశేషం.

త్రిసూర్‌కు చెందిన హరికృష్ణన్, లక్ష్మీ క్రిషన్ దంపతులు తమ జీవితాలను సాహసోపేతంగా మలచుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు మానేసి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్రాస్ కంట్రీ రోడ్ ట్రిప్‌కు వెళ్లాలనే డెసిషన్‌కు కుటుంబాలు కూడా మద్దతు తెలపడంతో తమ కారులోనే సాంస్కృతిక సాహస ప్రయాణాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టారు. కేవలం 2.5 లక్షల బడ్జెట్‌తో రోడ్ ట్రిప్‌ను సింపుల్‌గా డిజైన్ చేసుకున్న జంట.. తమ అవసరాలకు అనుగుణంగా కారును మాడిఫై చేసి, వెనుక సీటును మంచంగా మార్చారు.

రోడ్ సైడ్ దాబాల్లో భోజనం..

రోడ్ ట్రిప్‌లో భాగంగా చవకైన దాబాల్లో భోజనం చేస్తూ.. చాలా సందర్భాల్లో తమకు తామే వంట చేసుకుంటున్నారు. ఇక మీడియాతో ఇంటరాక్షన్ టైమ్‌లో హరికృష్ణన్ మాట్లాడుతూ.. ‘మేము 5 కిలోల గ్యాస్ సిలిండర్, ఒక బర్నర్ స్టవ్‌తో పాటు వంటకు అవసరమైన కొన్ని వస్తువులను తీసుకొచ్చాం. సాధారణంగా ఉదయాన్నే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఒక్కోసారి రాత్రి భోజనానికి కూడా అదే సరిపోతుంది’ అని తెలిపాడు.

ఈ జంట దాదాపు ఏడాది కిందట(అక్టోబర్ 28, 2020న) త్రిసూర్ నుంచి తమ సాహస యాత్రను ప్రారంభించారు. బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, కొల్హాపూర్, ముంబై వంటి నగరాల మీదుగా ప్రయాణిస్తూ కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన ఈ జంట.. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీతో పాటు జమ్మా కశ్మీర్‌ కూడా సందర్శించారు. మొత్తం మీద ఇప్పటి వరకు 15,000 కిమీ పైగా ప్రయాణించి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను అన్వేషించారు. కాగా ‘టీన్‌పీన్ స్టోరీస్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరి ట్రావెల్ జర్నీని తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma