టీకాపై నయా డౌట్స్.. తొలిడోసు తీసుకున్నాక కేరళ సీఎంకు పాజిటివ్

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా విజయన్ స్పందిస్తూ.. ‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోజీకోడ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకోబోతున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా దయచేసి టెస్ట్‌లు చేయించుకుని సెల్ప్ ఐసోలేషన్ లో ఉండండి..’ అని పేర్కొన్నారు. కాగా, ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు. పైగా మార్చి 3న ఆయన కొవిడ్ […]

Update: 2021-04-08 10:12 GMT

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా విజయన్ స్పందిస్తూ.. ‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోజీకోడ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకోబోతున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా దయచేసి టెస్ట్‌లు చేయించుకుని సెల్ప్ ఐసోలేషన్ లో ఉండండి..’ అని పేర్కొన్నారు. కాగా, ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు.

పైగా మార్చి 3న ఆయన కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నా సీఎంకు కరోనా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. ఆయన కూతురు వీణ, అల్లుడు మహ్మద్ రియాజ్‌లు ఇటీవలే కరోనా బారిన పడ్డారు. దీంతో వీణ పీపీఈ కిట్ వేసుకుని వచ్చి మరీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటేశారు.

Tags:    

Similar News