బుగ్గనకి దానమిస్తున్నా: కేఈ

కర్నూలు జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డికి దానమిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. డోన్‌లో ఆయన మాట్లాడుతూ, డోన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. మున్సిపాలిటీలోని 32 వార్డుల పరిధిలో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ 32వార్డులను బుగ్గనకు దానం చేస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు టీడీపీకి రాజీనామాపై తనతో […]

Update: 2020-03-13 04:23 GMT

కర్నూలు జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డికి దానమిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. డోన్‌లో ఆయన మాట్లాడుతూ, డోన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. మున్సిపాలిటీలోని 32 వార్డుల పరిధిలో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ 32వార్డులను బుగ్గనకు దానం చేస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు టీడీపీకి రాజీనామాపై తనతో ఇంకా చర్చించలేదని ఆయన తెలిపారు.

Tags: kurnool, tdp, dhone, ke krishnamurthy,local body elections, municipal elections

Tags:    

Similar News