రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్లు చూపించి రాష్ట్రాన్ని అప్పు ఊబిలోకి నెట్టే ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో వాస్తవికత లోపించిందన్నారు. రాష్ట్ర రాబడిలో రూ.25వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తుందన్నారు. తెచ్చిన అప్పులను తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం పెంచేందుకు అన్నింటిపై రేట్లు పెంచబోతున్నారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా అప్పులు […]
దిశ, న్యూస్ బ్యూరో
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్లు చూపించి రాష్ట్రాన్ని అప్పు ఊబిలోకి నెట్టే ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో వాస్తవికత లోపించిందన్నారు. రాష్ట్ర రాబడిలో రూ.25వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తుందన్నారు. తెచ్చిన అప్పులను తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం పెంచేందుకు అన్నింటిపై రేట్లు పెంచబోతున్నారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్నినాలుగేండ్లలో రూ.5లక్షల కోట్ల అప్పుల్లో నెట్టేస్తాడేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
tags;KCR to push the state into debt,CLP leader Bhatti Vikramarka,
Debts again to meet debts