దళిత బంధుకు నేనే సృష్టికర్త.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : దేశం మొత్తం మీద దళితులు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారని, స్వాతంత్ర వచ్చి 75 ఏండ్లు గడిచిన దళితుల జీవితాల్లో ఇంకా చీకటి ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. దేహంలో కొంత భాగాన్ని కట్​ చేస్తే దేహం కుప్పకూలుతుందని, అదే విధంగా దేశంలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. దేశంలో ఆర్థిక ఆసమానతలను రూపుమాపాలి అని చెప్పిన అంబేద్కర్​ గంభీరతను గ్రహించిన రాష్ట్రం మనదేనన్నారు. దళిత విద్యార్థుల కోసం రెసిడెన్సియల్​ పాఠశాలలను ఏర్పాటు […]

Update: 2021-08-15 00:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశం మొత్తం మీద దళితులు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారని, స్వాతంత్ర వచ్చి 75 ఏండ్లు గడిచిన దళితుల జీవితాల్లో ఇంకా చీకటి ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. దేహంలో కొంత భాగాన్ని కట్​ చేస్తే దేహం కుప్పకూలుతుందని, అదే విధంగా దేశంలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. దేశంలో ఆర్థిక ఆసమానతలను రూపుమాపాలి అని చెప్పిన అంబేద్కర్​ గంభీరతను గ్రహించిన రాష్ట్రం మనదేనన్నారు. దళిత విద్యార్థుల కోసం రెసిడెన్సియల్​ పాఠశాలలను ఏర్పాటు చేశామని, ఏడేండ్లలో 104 స్కూళ్లను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో దళితుల కోసం 238 స్కూళ్లు ఉన్నాయని, మహిళల కోసం డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఒక ఏడాదిలో దళిత నిధులు ఖర్చు కాకుంటే వాటిని వచ్చే ఏడాదికి సవరించేందుకు ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చిందన్నారు. దళిత జాతిని ప్రత్యేకంగా ఆదుకోవడమే ప్రభుత్వ విధి అని, అణగారిని దళిత జాతి అభ్యున్నతికి పాటుపడుతోందని, దీనికి సమాజం అండగా నిలబడాలని, దళిత సమాజానికి నమ్మకం కల్పించి, కులం గోడలను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.

దళిత జాతి సమగ్రత కోసం ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు అని సీఎం వెల్లడించారు. దళితులు స్వశక్తితో, స్వావలంభనతో జీవించాలనేందుకు రూపమే దళిత బంధు పథకం. ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని సమాజంలో నిలబెట్టాలని దళిత బంధును రూపొందించినట్లు సీఎం ప్రకటించారు. బడ్జెట్​లో దళిత బంధు కోసం నిధులు పెట్టామని, హుజురాబాద్​లో రేపట్నుంచి ఫైలట్​ ప్రాజెక్టుగా చేపట్టుతున్నామని, మిగతా నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించకుండా పూర్తిగా ఉచితంగా వారి ఖాతాలకు జమ చేస్తాం. వారికి ఏ ఏ వ్యాపారులు చేసుకోవాలనే దానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకే పరిమితం కాదని, వారిని వివిధ రంగాల వ్యాపారాల్లో ప్రొత్సహించేందుకు ప్రత్యేక రిజర్వేషన్​ ఇస్తామన్నారు. మెడికల్​, ఫర్టిలైజర్​ షాపులు, వైన్​, బార్లకు దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దళిత వర్గాలకు ఏదైనా ఆపద వస్తే వారి కుటుంబం ఇబ్బందులకు గురికాకుండా దళిత బంధు పథకం ఉంటుందని, వీరి కోసం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుడి నుంచి రూ. 10 వేలు, ప్రభుత్వం నుంచి రూ. 10 వేలు కలిపి రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో దళిత బంధు సమితిలు ఏర్పాటు చేస్తున్నామని, దళిత బంధు నిధి, దళిత రక్షణ నిధికి కలెక్టర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నా మిగిలిన పథకాలు ఆగవని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. దళిత బంధును ఒక పథకంగా కాకుండా దళిత ఉద్యమంగా ముందుకు తీసుకుపోతామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో దళిత బంధు గురించి చర్చ జరుగుతుందన్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు.

Tags:    

Similar News