చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో సీఎం మాట్లాడారు. వందేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు వచ్చాయని దీంతో […]

Update: 2020-10-21 05:30 GMT
చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో సీఎం మాట్లాడారు.

వందేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు వచ్చాయని దీంతో పెద్ద ఎత్తున వరద నీరు చెరువులకు చేరిందన్నారు. ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండిపడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎక్కడ ఏదైనా ఘటన జరిగితే వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. వరద ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

Tags:    

Similar News