దేశంలోనే అవినీతిపరుడు సీఎం కేసీఆర్: రాజనర్సింహా
దిశ, ఆందోల్: దేశంలోని అత్యంత అవినీతి పరుడైన సీఎంగా కేసీఆర్‌కు గుర్తింపు వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి సీఎం కేసీఆర్ అందినకాడికి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. జోగిపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ అవినీతిని, నియంతృత్వ ధోరణిని ప్రాజెక్టుల కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జీహెచ్ఎంసీలో […]
దిశ, ఆందోల్: దేశంలోని అత్యంత అవినీతి పరుడైన సీఎంగా కేసీఆర్‌కు గుర్తింపు వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి సీఎం కేసీఆర్ అందినకాడికి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. జోగిపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ అవినీతిని, నియంతృత్వ ధోరణిని ప్రాజెక్టుల కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
జీహెచ్ఎంసీలో గెలుపు అప్రజాస్వామికం:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా టీఆర్ఎస్ పంపిణీ చేసినా పోలీసులు పట్టించుకో లేదన్నారు. కొన్ని చోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురి చేసిందని ఆరోపించారు. అధికార దుర్వినియోగంతోనే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందన్నారు.